India vs England Third test Preview | నేటి నుంచి ఇండియా vs ఇంగ్లాండ్ 3వ టెస్ట్
ఇండియా ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. మొదటి టెస్ట్ లో తడబడ్డ ఇండియా.. రెండవ టెస్ట్ లో మాత్రం చరిత్రలు సృష్టించి విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో ఇండియా ఎలా ఆడనుంది... బుమ్రా ప్లేయింగ్ 11 లో ఉంటాడా లేదా... అసలు ఎలాంటి మార్పులు చేయబోతున్నారని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే మూడో టెస్టుకు ప్లేయింగ్ లెవన్ ను ఇంగ్లాండ్ జట్టు ప్రకటించింది. లార్డ్స్ వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని ... ఆర్చర్ ని బరిలోకి దింపనున్నారు. రెండో టెస్టులో కీలక వికెట్లు తీసిన జోష్ టంగ్ తీశాడు. అయితే ఆర్చర్ కోసం అతడిని పక్కన పెట్టక తప్పలేదు. ఆర్చర్ రాకతో పేస్ పుంజుకుంటుందని ఇంగ్లాండ్ భావిస్తోంది. ఆర్చర్ రాకతో మూడో టెస్టులో పట్టు బిగిస్తామని ఇంగ్లాండ్ ఆశాభావంగా ఉంది.
ఇక పిచ్ కారణంగా టీమిండియాలో కూడా మార్పులు తప్పవు.
బుమ్రా మూడో టెస్టులో ఆడటం ఖాయంగానే కనిపిస్తోంది. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది కాబట్టి మరో పేసర్ గా అర్షదీప్ సింగ్ ను తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మోతంగా లార్డ్స్ లో జరిగే ఈ మ్యాచ్ లో పేసర్లు బుమ్రా, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్ తుది జట్టులో ఉండే ఛాన్స్ కూడా ఉంది. సుందర్, నితీశ్ కుమార్ ను పక్కన పెట్టే చాన్స్ ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే కరణ్ నాయర్ కి ఇంకో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ లో కూడా రిజర్వు బెంచ్‌లోనే ఉండేలా కనిపిస్తుంది.
2021 ఆగస్టులో లార్డ్స్‌లో టీమ్ఇండియా ఆఖరి సారిగా విజయం సాధించింది. 60 ఓవర్లలో 272 పరుగుల లక్ష్యం ఇచ్చిన ఇండియా.... ఇంగ్లాండ్ ను 51.5 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ గేమ్ మొదలైయే ముందు విరాట్ కోహ్లీ బౌలర్లతో '60 ఓవర్లలో వాళ్లు నరకం అనుభవించాలి' అన్న మాటలు ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అదే మ్యాచ్ లో సిరాజ్ నాలుగు వికెట్లు తీసాడు. మరి ఈ మ్యాచ్ లో టీం లో ఇండియాఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి. 2021 మ్యాచ్ ను మళ్ళి ప్రిన్స్ రిపీట్ చేస్తాడా లేదా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.





















