India Cricket team|దక్షిణాఫ్రికా టూర్ పై ఒమిక్రాన్ ఎఫెక్ట్..సందిగ్ధం లో ఆటగాళ్లు..
దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటనపై సందిగ్ధం నెలకొంది. షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 9న టీమ్‌ఇండియా ఛార్టర్ విమానం ఎక్కాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఆటగాళ్లకు ఎలాంటి సమాచారం లేదు. పైగా పర్యటించే జట్టునూ ఇంకా ప్రకటించలేదు. సఫారీ దేశానికి వెళ్లేందుకు భారత ఆటగాళ్లు జంకుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది! ఒమిక్రాన్ వేరియెంట్ మొదట దక్షిణాఫ్రికాలోనే వెలుగు చూసింది. అక్కడి నుంచి దేశ విదేశాలకు పాకేస్తోంది. తాజాగా భారత్‌కూ వచ్చేసింది. ఈ వేరియెంట్ కారణంగా దక్షినాఫ్రికాలో కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పర్యటించేందుకు కొందరు ఆటగాళ్లు జంకుతున్నారని తెలిసింది. అక్కడికి వెళ్లలేమనీ, తమకు ఆందోళనగా ఉందని అంటున్నారట.





















