Ind vs Eng 2nd Test | టీం ఇండియాలో మార్పులు తప్పవా ?
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో భారత్ ఓడిపోవడంతో 0-1తో సిరీస్ లో వెనుకంజలో ఉంది. దాంతో బర్మింగ్ హామ్ లో జరిగే రెండో టెస్టు మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. బర్మింగ్ హామ్ లో ఇండియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మరి, ఈ సారి ఇండియా ఎలాంటి అద్భుతం చేస్తుందో చూడాలి. మరోవైపు, తొలి టెస్టు విజయంతో ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో ఉంది.
తోలి టెస్ట్ ఓడిపోవడంతో ఇండియా టీంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ టెస్టుకు స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. ప్రస్తుతం బుమ్రా ట్రైనింగ్ సెషన్లో పాల్గొంటున్నాడని, ప్రాక్టీస్ సెషన్ ముగిశాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాడు శుబ్మన్ గిల్. ఒక వేళ బుమ్రా ఆడకపోతే ఆర్ష దీప్, ఆకాష్ దీప్ ... వీలలో ఒకరికి చోటు దక్కుతుంది. తోలి టెస్ట్ మ్యాచ్ లో ప్రదర్శన తర్వాత సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఈ మ్యాచ్ లో ఫైనల్ టీంలో ఉంటారో లేదో చూడాలి. ఇక నితీశ్ రెడ్డికి పేస్ ఆల్ రౌండర్ ప్లేస్ లో చోటు దక్కడం ఖాయమన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ప్లేయర్స్ అందరు మంచి ఫార్మ్ లో ఉన్నారు. మొదటి టెస్ట్ లో సెంచరీలతో చెలరేగారు.
అయితే పిచ్ ప్రకారం టీం ని ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది. బర్మింగ్ హామ్ స్పిన్నర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంది. దాంతో టీం ఇండియా తరపున ఇద్దరు స్పిన్నర్లు ఆడే అవకాశముంది. మరి ఎవరిని టీం లోకి తీసుకుంటారు. ఎవరిని పక్కన పెడతారు అన్నది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. ఈ రెండవ మ్యాచ్ లో గెలవాలంటే టీం ఇండియా ఎన్ని మార్పులు చేర్పులు చేస్తుందో చూడాలి.





















