Surya Kumar Yadav captaincy | కెప్టెన్ గా మ్యాజిక్ చేశాడు..ధోని లా ఫ్యూచర్ ని ఎంకరేజ్ చేశాడు | ABP
సూర్య కుమార్ యాదవ్. టీమిండియాకు పూర్తి స్థాయిలో టీ20 కెప్టెన్ గా తొలి సిరీస్ నే వైట్ వాష్ చేసి గెల్చుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో అయితే సూర్య తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్ తో పాటు సిరీస్ ను వైట్ వాష్ చేసేలా హెల్ప్ చేశాయి. ప్రధానంగా రెండు 9 పరుగులే కొట్టాలన్నప్పుడు రింకూ కి బౌలింగ్ ఇవ్వటం తనే స్వయంగా బౌలింగ్ చేయటం లాంటి నిర్ణయాలతో సూర్య కుమార్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. ఈ ట్విస్ట్ తో శ్రీలంక ఏం చేయలేక మ్యాచ్ నే సమర్పించుకుంది. 0-3తేడాతో తన తొలి విదేశీ సిరీస్ ను గెల్చుకున్న సూర్య కుమార్ యాదవ్ కప్ అందుకుని దాన్ని వెంటనే రింకూ సింగ్, రియాన్ పరాగ్ లకు అందించాడు. కప్ అందుకోవటం టీమ్ లో ఉన్న కుర్రాళ్లకు దాన్ని అందించటం అనేది టీమిండియాలో ధోని నెలకొల్పిన లెగసీ. దాన్ని సూర్య కుమార్ యాజ్ ఈజ్ టీజ్ గా ఫాలో చేశాడు సూర్య కుమార్ యాదవ్. వాస్తవానికి సూర్య కుమార్ కి పూర్తి స్థాయి కెప్టెన్ గా ఇది మొదటి సిరీస్ విజయం అయినా..ఇప్పటికే కెప్టెన్ గా రెండు సిరీస్ లకు వ్యవహరించాడు స్కై. 2023లో ఆస్ట్రేలియా చేతిలో వరల్డ్ కప్ ఓడిపోయిన నాలుగు రోజుల తర్వాత అదే ఆసీస్ తో భారత్ టీ20 సిరీస్ ఆడింది. దానికి కెప్టెన్ సూర్యనే. 4-1 తేడాతో ఆ టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా తో జరిగిన టీ20 సిరీస్ కు సూర్య నే కెప్టెన్ ఆ సిరీస్ ను 1-1 తేడాతో డ్రా చేసుకున్నాడు సూర్య. మూడో టీ20 మ్యాచ్ లో సెంచరీ ద్వారా భారత్ ను గెలిపించి సిరీస్ ను డ్రా చేశాడు అప్పుడు. అయితే అప్పుడే గాయం అయ్యి మళ్లీ ఐపీఎల్ వరకూ మ్యాచ్ లు ఆడలేకపోయాడు. అలాంటి సూర్య ఈ సారి పూర్తి స్థాయి కెప్టెన్ గా వ్యవహరించిన తొలి సిరీస్ లో శ్రీలంకను వాళ్ల దేశంలోనే ఓడించి వైట్ వాష్ చేయటం ద్వారా కెప్టెన్ గా మూడో సిరీస్ ను ఓటమి లేకుండా ముగించాడు సూర్య కుమార్ యాదవ్.