(Source: ECI/ABP News/ABP Majha)
Rohit Sharma Announces Retirement from T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ ను నిలిపిన మొనగాడు, ధీరోధాత్తుడు రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సంబరాలు పూర్తయ్యాక ప్రెస్ మీట్ పెట్టిన రోహిత్ శర్మ టీ20 లనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్ లో 20ఏళ్ల వయస్సులో అరంగ్రేటం చేయటం ద్వారా ఈ ఫార్మాట్ ను ఆడటం మొదలుపెట్టిన రోహిత్...ఇప్పుడు 37ఏళ్ల వయస్సులో 2024లో జరిగిన టీ20 ప్రపంచకప్ ను కెప్టెన్ గా ఆడి గెలిపించి భారత్ కు అందించిన తర్వాత రోహిత్ సగర్వంగా రిటైర్మెంట్ ను ప్రకటించాడు. ఈ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పటానికి ఇంత కంటే బెటర్ టైమ్ ఉండదన్న రోహిత్...టీ20ల్లో ఆడిన ప్రతీక్షణాన్ని ఎంజాయ్ చేశానన్నాడు. ఈ ఫార్మాట్ ను ఆడటం ప్రపంచకప్ తోనే మొదలు పెట్టానని...అదే తనకు తొలి అవకాశం కూడా ఇచ్చిందన్న రోహిత్...ఈ వరల్డ్ కప్ గెలవాలని తనెంతగా కోరుకున్నాడో వివరించాడు. అందుకే ఈ విజయంతో టీ20ల్లో ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించాడు. తన కెరీర్ లో 159 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ...4231పరుగులు చేసి భారత్ తరపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మే పేరిటే అత్యధికంగా టీ20ల్లో ఐదు సెంచరీలు ఉన్నాయి. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్..2024లోనూ టీ20 వరల్డ్ కప్ గెలిచి రెండు టీ20 వరల్డ్ కప్ లు గెలిచిన ఏకైక భారత ఆటగాడిగా మరో రికార్డును నెలకొల్పాడు. ఈ వరల్డ్ కప్ లోనూ బ్యాట్ తో మోత మోగించిన హిట్ మ్యాన్ 156 స్ట్రైక్ రేట్ తో 257పరుగులు చేసి భారత్ ఫైనల్ చేరటంలో కీలకపాత్ర పోషించాడు...వరల్డ్ కప్ విజయంలో అన్నీ తానై వ్యవహరించాడు.