Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి మొదలయింది. రీసెంట్ గా నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తమ అభిమానులను ఎంతో అలరించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ తన మాటలతో ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగులు చెబుతూ అభిషేక్ చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఈవెంట్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలతో కలిసి అభిషేక్ శర్మ పాల్గొన్నాడు. తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని గతంలోనే చెప్పిన అభిషేక్.. ఫ్యాన్స్ కోరిక మేరకు నేను ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్‌గా కమిట్ అయిపోతా అంటూ పోకిరి డైలాగ్ చెప్పాడు. అంతటితో ఆగకుండా జై బాబు అంటూ నినాదాలు చేయడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు.
ఈ సందర్భంగా కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2026 కోసం తాము సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశాడు. హెడ్, క్లాసెన్ సెంచరీలు చేస్తే ఈసారి 300 స్కోర్ కూడా సాధ్యమేనని ఇషాన్ అన్నాడు.
ట్రెండింగ్ వార్తలు

















