Changes in Indian Cricket Coach position | కోచ్‌లను మార్చబోతున్న టీమిండియా ?
ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ లో బౌలర్లు బుమ్రా, సిరాజ్ లు ఫెయిల్ అయ్యారు. అన్షుల్ కాంబోజ్, శార్దూల్ ఠాకూర్ కూడా అంతగా రాణించలేక పొయ్యారు. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ లు 70కి పైగా ఇండివిడ్యుల్ స్కోర్ లు చేసారు. జో రూట్ 150, బెన్ స్టోక్స్ 141 పరుగులు చేయగా జాక్ క్రాలే 84, బెన్ డకెట్ 94, ఓల్లీ పోప్ 71 పరుగులు చేశారు. ప్రత్యర్థి బ్యటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలం అవడంతో మేనేజ్‌మెంట్, కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.
బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో పాటు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషెట్‌లను తప్పించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. టీం ఇండియా సెప్టెంబర్‌లో ఏషియా కప్ 2025 టోర్నీ ఆడనుంది. ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత లాంగ్ బ్రేక్ వస్తుంది. మరి ఏషియా కప్ తర్వాత వీరిని రీప్లేస్ చేస్తారా.. లేదా ముందే చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కూడా అసంతృప్తిగా ఉందట బీసీసీఐ. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇండియా 14 టెస్టులు ఆడితే అందులో 4 మాత్రమే గెలిచింది. ఇక గంభీర్ తన పొజిషన్‌ని కాపాడుకోవాలంటే ఓవల్ టెస్టు గెలవాల్సిందే.
గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకూ ఉంది. జగరబోయే ఏషియా కప్ లో ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ రాకపోతే గంభీర్ నుహెడ్ కోచ్ పొజిషన్ నుంచి తపించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.




















