రామకోటి స్థూపంలో పుస్తకాల నిక్షిప్తం..
రామకోటి పుస్తకాలను రామాలయాల్లో భద్రపరచి ఆ తర్వాత భద్రాచలంకి పంపిస్తుంటారు. కొంతమంది భక్తులు నేరుగా భద్రాచలం ఆలయంలో వాటిని సమర్పిస్తారు. అయితే నెల్లూరు జిల్లా వాసులు మాత్రం నెల్లూరులోని శబరి శ్రీరామ క్షేత్రంలో వాటిని అందిస్తుంటారు. శబరి శ్రీరామ క్షేత్రంలో భద్రపరచిన ఆ పుస్తకాలను ప్రతి ఏటా శ్రీరామ నవమి వంటి పర్వదినాల సమయంలో రామకోటి స్థూపంలో నిక్షిప్తం చేస్తారు. ఏపీలోనే కాదు, దేశంలో ఉన్న రామకోటి స్థూపాల్లో నెల్లూరులో ఉన్న స్థూపమే పెద్దదని చెబుతారు. ఈ ఏడాది హనుమద్వత్రం సందర్భంగా రామకోటి పుస్తకాలను ఊరేగింపుగా తీసుకెళ్లి రామకోటి స్థూపంలో నిక్షిప్తం చేశారు. రామకోటి పుస్తకాలకు భక్తితో పూజలు చేసి, క్రేన్ సాయంతో వాటిని రామకోటి స్థూపం పైకి తీసుకెళ్లి.. అక్కడినుంచి వాటిని స్థూపంలో నిక్షిప్తం చేశారు.





















