Kondagattu Hanuman Temple | కొండగట్టు హనుమంతుడికి రెండు పుట్టినరోజులు ఎందుకో తెలుసా
దేశంలో మరే ఆలయంలోనూ, మరే దేవుడికీ లేని విధంగా ఇక్కడి ఆంజనేయస్వామికి ఏడాదికి రెండు జయంతులు జరుగుతాయి. రెండు సందర్భాల్లోనూ హనుమంతుడిని, ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అదే కొండగట్టు ఆంజనేయుడి ఆలయం.
వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్ధశి నాడు స్వాతి నక్షత్రంలో జన్మించాడు. ఆరోజునే చాలా ఆలయాల్లో హనుమాన్ జయంతిని జరుపుతారు. అయితే, కొన్ని ఆలయాల్లో చైత్ర పౌర్ణమి రోజున కూడా హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. దీన్నే చిన్న జయంతి అంటారని, దీని వెనుక ఓ కథ ప్రచారంలో ఉందని కొండగట్టు ఆలయ ఆస్థాన అర్చకుడు కపిలేశ్వర స్వామి తెలిపారు. అదేంటంటే...
సాధారణంగా ఏక ముఖ ఆంజనేయుడు లేదా పంచముఖ ఆంజనేయుడి ఆలయాలు మనకు కనిపిస్తుంటాయి. కానీ కొండగట్టు ఆలయంలో స్వామివారు రెండు ముఖాలతో ఉంటారు. ఒకటి హనుమంతుడి ముఖం, రెండోది నరసింహస్వామి ముఖం. ఇలాంటి ఆలయం మరెక్కడా లేదని ఆలయ అర్చకుడు కపిలేశ్వర స్వామి వివరించారు.
600 ఏళ్ల నాటి పురాతన ఆలయమైన కొండగట్టు ఆలయంలో ఈ రెండు జయంతి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆ రెండు రోజుల్లో కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. హనుమాన్ జయంతి రోజున స్వామిని దర్శించుకుంటే కష్టాలు, భయాలు తొలగిపోతాయని, అనారోగ్య సమస్యలు దూరమవుతాయని భక్తుల నమ్మకం.