(Source: ECI/ABP News/ABP Majha)
Donald Trump: ట్రంప్ మావయ్యను ఏసేస్తారా? ఎందుకురా ఇంత స్కెచ్చేశారు?
అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో విదేశాల జోక్యం పెరిగిపోయిందని ఆ దేశ ఇంటెలిజెన్స్ తరచూ చెప్తూ వస్తోంది. చైనా, రష్యా, ఇరాన్ interference బాగా ఉంటుందని వివిధ సందర్భాల్లో యూఎస్ ఫెడరల్ ఏజెన్సీస్ చెప్పాయి. ఇక ఇరాన్ అయితే, రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, మాజీ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్‌ను చంపడానికి ట్రై చేస్తుందని హెచ్చరిస్తున్నాయి. ఇదే విషయాన్ని ట్రంప్ పదే పదే తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ప్రస్తావిస్తున్నారు. ఇరాన్ తనను హత్య చేయాలని కుట్ర చేస్తున్నట్లుగా తనను యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అలర్ట్ చేసినట్లుగా ట్రంప్ చెప్తున్నారు. ఇప్పటికే తన మీద ఇరాన్ చేసిన హత్యాయత్నాలు ఫలించలేదని.. వారు మళ్లీ ప్రయత్నిస్తారని ట్రంప్ అంటున్నారు. అందుకే తన చుట్టూ ఇంతకుముందు కన్నా ఎక్కువ మంది ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఉన్నాయని అని ట్రంప్ X లో ఒక పోస్ట్ కూడా చేశారు. మరి డొనాల్డ్ ట్రంప్ కి ఇరాన్ నుంచి లైఫ్ త్రెట్ ఉండాల్సిన అవసరం ఏముంది?