Shubhanshu Shukla Wife kamna Emotional | శుభాన్షు భార్య కామ్నా ఎమోషనల్ | ABP Desam
అంతరిక్ష ప్రయాణానికి బయల్దేరే ముందు ఇస్రో ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా ముందు ఆయన భార్య కామ్నా శుక్లా కన్నీళ్లు పెట్టుకున్నారు. అద్దం అవతల ఉన్న భర్తను చూస్తూ కామ్నా కన్నీళ్లు పెట్టుకున్న ఈ ఎమోషనల్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫోటోను శుభాన్షునే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతటి గొప్ప అవకాశం తనకు రావటానికి కారణమైన భారత ప్రభుత్వానికి, నాసాకు, స్పేస్ ఎక్స్, ఆక్సియం సంస్థలకు ధన్యవాదాలు చెప్పిన శుభాన్షు..భారత పతాకం గర్వించేలా ఓ పైలెట్ గా తన విధులను నిర్వర్తిస్తానని ఎమోషనల్ నోట్ రాశారు శుభాన్షు. తన భార్య పిల్లలు, కుటుంబం తోడ్పాటు ఈ జర్నీలో తనకు ఎంతో అవసరం అన్నారు శుభాన్షు శుక్లా.ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా నింగిలోకి దూసుకు వెళ్లారు. ఆక్సియమ్ 4 మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్తున్న శుభాన్షు అక్కడ 14రోజులు వేర్వేరు ప్రయోగాలు చేయనున్నారు.





















