Srikakulam: జిల్లాల విభజన జరిగితే కొత్తగా ఆవిర్భవించిన జిల్లాకు నష్టం అంటున్న సిక్కోలు వాసులు.
పది జిల్లాలతో ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణలో జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి ఏకంగా రెండు జిల్లాల గా రూపొందించారు అదే స్ఫూర్తితో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్- ను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పునర్విభజన ప్రక్రియ దృష్టిసారించారు. పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాల పునర్విభజన పూర్తిచేయాలని ఇందుకు కొలమానంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే అధికారులు రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు .పార్లమెంటరీ ప్రతిపాదన జిల్లాల విభజన జరిగితే కొత్తగా ఆవిర్భవించిన జిల్లాకు జరిగే నష్టంపై ఇప్పటికే జిల్లాలో ఉద్యమం పోరాటానికి సిద్ధమవుతున్నారు





















