Omicron In AP : ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నిర్థారించిన వైద్యారోగ్యశాఖ
ఆంధ్రప్రదేశ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఐర్లాండ్ నుంచి విశాఖ కు వచ్చిన విజయనగరానికి చెందిన వ్యక్తికి ఓమిక్రాన్ సోకినట్లు నిర్థారణైంది. అయితే ఈ నెల 11వ తేదీన మరోసారి ఆ వ్యక్తికి రీ టెస్టింగ్ జరపగా అందులో మాత్రం నెగటివ్ వచ్చింది. ఫలితంగా ఏపీలో ప్రస్తుతం ఎలాంటి ఒమిక్రాన్ కేసులు లేవని వైద్యారోగ్యశాఖ చెబుతోంది. విదేశాల నుంచి వచ్చిన 15మంది వైరస్ అనుమానిత కేసుల శాంపుల్స్ ను జీనోమ్ టెస్టింగ్ పంపితే..10 శాంపిళ్ల నివేదకలు అందాయని తెలిపింది. వాటిలో ఒక్క కేసు మాత్రమే ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్లు ప్రకటించింది. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని...కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.





టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

