అన్వేషించండి
Nellore Crime : ఊరటనిచ్చిన 2021.. నెల్లూరులో తగ్గిన నేరాలు
నెల్లూరు జిల్లాలో 2020తో పోల్చి చూస్తే 2021లో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఏడాది క్రైమ్ రివ్యూ సందర్భంగా నేరాల సంఖ్య తగ్గినట్టు తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు. 2020లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 7,897 నేరాలు నమోదవగా.. 2021లో 7,513 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. జిల్లాలో క్రైమ్ రేట్ 5 శాతం మేర తగ్గిందని అన్నారు. అంతకు ముందు ఏడాది 2019తో పోల్చుకుంటే 11 శాతం వరకు నేరాల శాతం తగ్గుముఖం పట్టిందని ఇది సంతోషించదగ్గ పరిణామం అని అన్నారు .
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రికెట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్





















