Mumbai Police : నెటిజన్ల నుంచి ముంబై పోలీసులకు చిక్కు ప్రశ్నలు,తగ్గేది లేదంటున్న పోలీసులు |ABP Desam
వైన్ ఆల్కహాల్ కాదని...దాని వల్ల రైతులకు లాభమని ప్రకటిస్తూ మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వం కొత్త ప్రకటనలు చేసింది. సరే దాని సంగతి అలా ఉంచితే...ఇప్పుడు వైన్ ను సూపర్ మార్కెట్లుల్లో, షాపుల్లో ఎక్కడ పడితే అక్కడ విక్రయిస్తున్నారు. సరే వైన్ ఆల్కహాల్ కానప్పుడు మరి వైన్ తాగి బండి నడిపితే తప్పా అనే కామన్ లాజిక్ డౌట్ ప్రజల్లో వచ్చింది. దాన్నే కొంత మంది ముంబై పోలీస్ కు ట్యాగ్ చేసి మరీ అడిగారు. వైన్ తాగి బండి నడిపితే కేసు అవుతుందా అమాయకంగా ప్రశ్నించారు. దానికి స్పందించిన ముంబై పోలీసులు బ్రీత్ అనలైజర్ లో టెస్ట్ చేస్తాం...ఆల్కహాల్ కంటెంట్ చూపిస్తే కేసు ఉంటుందని చెప్పేశారు. దీంతో ప్రతిపక్ష నేతలు భగ్గమంటున్నారు. ఆల్కహాల్ కాదని ప్రభుత్వం అంటుంది..కేసులు పెడతామని పోలీసులు అంటున్నారు...ప్రజలకేంటీ ఈ అగత్యం అంటూ వాళ్లూ పోస్టులతో రెచ్చిపోతున్నారు. సరే ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకుందేమో ముంబై పోలీస్...వైన్ తాగితే తాగుండ్రి మాకేం సంబంధం లేదు కానీ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లండి..రోడ్ సేఫ్టీ ని కాపాడండి మరో కొత్త నినాదంతో ముందుకు వచ్చింది. నాయకులకేం వంద కొత్త నిర్ణయాలను ప్రకటించేస్తారు. ఇక్కడ మా తల ప్రాణం తోక వస్తోందని వాపోతున్నారు ముంబై పోలీసులు..అఫ్ కోర్స్ డైరెక్ట్ ఎక్కడా అనలేదు కానీ...వాళ్ల సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చూస్తే మాత్రం అదే అనిపిస్తోంది. సో ఇదన్న మాట శివసేన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో...ప్రజల డౌటానుమానాలు....ముంబై పోలీసులు పడరాని పాట్లు.