Lady Acts Brave, Saves Husband: హత్యాయత్నం నుంచి భర్తను కాపాడిన భార్య ..
భర్తకు అపాయం ముంచుకొచ్చిన వేళ... కంగారు పడకుండా కాళిలా వ్యవహరించిన గృహిణి ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. వరంగల్ లోని శంభునిపేటలో భూపాల్, కల్యాణి దంపతులు ఉంటున్నారు. జిల్లా లారీ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా భూపాల్ ఉన్నారు. అతణ్ని హతమార్చేందుకు అర్ధరాత్రి నలుగురు ఆటోలో రాగా... ముగ్గురు ఇంట్లోకి చొరబడి భూపాల్ పై కత్తులతో దాడికి దిగారు. దారుణాన్ని గమనించిన కల్యాణి... వంటింట్లో నుంచి కారం తీసుకొచ్చి దుండగుల మొహంపై చల్లి వారిని కొట్టింది. బిగ్గరగా అరిచింది. దుండగుల్లో ఒక్కరు మినహా అంతా పారిపోయారు. స్థానికుల సాయంతో రంజిత్ అనే వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రంజిత్ ను పోలీసులు విచారించగా... భూ వివాదం వల్లే హత్యాయత్నం చేసినట్టు తేలింది.





















