Honeymoon Couple Murder Case | పెళ్ళికి ముందే మర్డర్ ప్లాన్ | ABP Desam
ఇండోర్ హనీమూన్ జంట రాజా రఘువంశీ, సోనమ్ కేసులో రోజు ఒక కొత్త విషయం బయటకి వస్తుంది. ఈ జంట పెళ్లి చేసుకున్న వీడియోలు, పెళ్లి తర్వాత దిగిన ఫోటోలు ఒక్కోక్కటిగా బయటకి వస్తున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పుడు మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పెళ్లి తర్వాతే రాజాని మర్డర్ చేయడానికి సోనమ్ తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిందని అందరు అనుకున్నారు. కానీ పెళ్లికి మూడు నెలల ముందే హత్యకు కుట్ర జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే రాజా రఘువంశీ వంటిపై క్షుద్రపూజలు చేసినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయి అని గుర్తించారు పోలీసులు. తన కూతురు ఇంట్లోనే క్షుద్రపూజలు చేసేదని సోనమ్ తండ్రి వెల్లడించారు.
సోనమ్ ని మేఘాలయా మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ హాస్పిటల్ కి మెంటల్ హెల్త్ అస్సేస్మెంట్ కోసం తీసుకోని వెళ్లారు. మానసిక పరీక్షలో కూడా సోనమ్ స్టేబుల్ గానే ఉన్నట్టుగా తేలింది. సోనమ్ తోపాటు మిగితా నిందితులని వెయ్ సాడోంగ్ ఫాల్స్ కి తీసుకోని వెళ్లి సీన్ రీ క్రియేషన్ చేసారు పోలీసులు.





















