అన్వేషించండి

Paadi Kaushik Reddy Controversy: కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?

కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరి, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత జరిగిన ఘటనల వల్ల పార్టీకి లాభం కంటే, నష్టమే ఎక్కువ. దూకుడు, ఆవేశం తప్పుకాదు, కానీ ఎక్కడ వాడాలో తెలియకపోవడం పెద్ద ముప్పు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.
  • అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీవ్ర నిరసన.
  • గతంలోనూ కౌశిక్ రెడ్డిపై అనేక వివాదాలు, కేసులు నమోదయ్యాయి.
  • వివాదాస్పద వ్యాఖ్యలు, అరెస్టులతో కౌశిక్ రెడ్డి పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు.

Paadi Kaushik Reddy Controversy: తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సైతం కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాడిన పదజాలం విన్నవారికి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. త్వరలో కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వంపై వేటు లేదా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు చెప్పకనే చెప్పేశారు సీఎం. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీలో నిప్పులు చెరిగిన విధానం, ఏకంగా ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ నక్సలైట్‌గా కౌశిక్ రెడ్డిని పోల్చిన తీరు పెను సంచలనంగా మారింది. ఓ ఎమ్మెల్యేపై అసెంబ్లీలో ఇంత రచ్చ అవసరమా అని కొందరు అనుకోవచ్చు, కానీ కౌశిక్ రెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా 2021లో హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి  ఆయన దూకుడు మాములుగా లేదంటున్నారు రాజకీయ విమర్శకులు. తాజాగా సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లడుతుండగా తుపాకీతో కాల్చిపడేస్తానంటూ అసెంబ్లీలో సైగలు చేసి, అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎథిక్స్ కమిటీని సైతం ఏర్పాటు చేసి వేటుకు రంగం సిద్దం చేశారు. 

గత ఐదేళ్లుగా అదే దూకుడు...

కౌశిక్ రెడ్డిని వివాదాలు వెంటాడతాయో లేక తానే వివాదాలను ముద్దాడుతాడో తెలియదు కానీ, ఎక్కడుంటే అక్కడ పొలిటిక్ రచ్చ సర్వసాధారణంగా మారింది. 2024లో హైదరాబాద్‌లో విధినిర్వహణలో ఉన్న ఓ ఎస్‌ఐపై అనుచితంగా ప్రవర్తించాడని, విధులకు ఆటంకం కలిగించాడని కౌశిక్ రెడ్డిపై అప్పట్లో కేసు నమోదైంది. హైదరాబాద్ కౌశిక్ నివాసం చుట్టూ భారీగా పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదానికి ముందు తన భార్య శాలినీ పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి గుడిలో ఫొటో షూట్ నిర్వహించి, సోషల్ మీడియాలో వీడియోలో పోస్ట్ చేయడంపై కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.

2025లో కరీంనగర్ కలక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లడుతుండగా, నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవి చెప్పంటూ కౌశిక్ రెడ్డి మధ్యలో జోక్యం చేసుకోవడం, సంజయ్‌తో బాహాబాహీకి దిగడం వివాదంగా మారింది. తనపైన కౌశిక్ రెడ్డి దాడి చేశాడంటూ ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో సెక్షన్  126,115, 352, 292ల కింద కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు, హైదరాబాద్ వచ్చి కౌశిక్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్  చేసి కరీంనగర్ స్టేషన్ కు తరలించారు.

నోరు జారడం.. క్షమాపణలు చెప్పడం అలవాటే..!

ఓ గ్రానేట్ సంస్ద యజమానిని బెదిరించి 50లక్షలు డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలపై జూన్ 1, 2025లో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి, ఎక్స్ టార్షన్ కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీరా, గాజులు చూపిస్తూ కౌశిక్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఇటీవల సమక్క సారక్క జాతర జరుగుతున్న సమయంలో వీణవంక మండలంలోని సమ్మక్క జాతరకు కుటుంబ సమేతంగా వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని మతం పేరుతో దూషించాడంటూ పెను దుమారం రేగింది. అదే రోజు బలవంతంగా కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం, రోజంతా హైడ్రామా కొనసాగింది. ఆవేశంలో మాట్లడాను , కావాలని మతం పేరుతో పోలీసు అధికారిని దూషించలేదంటూ క్షమాపణలు కోరుతూ మరుసటి రోజు వీడియో విడుదల చేయడంతో వివాదం కాస్తా తాక్కాలికంగా సర్దుమణిగింది.

ఇలా ఒకటేమిటి హుజూరాబాద్ గడచిన ఎన్నికల సమయంలో కౌశిక్ రెడ్డి ఓట్లు అభ్యర్ధించిన తీరు, కుటుంబ సమేతంగా విడుదల చేసిన వీడియోలు రాజకీయంగా వివాదాలను తెచ్చిపెట్టాయి. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌కు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అరెకెపూడి  గాంధీ, దానం నాగేందర్‌పై కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై అంతే స్థాయిలో వాళ్లు స్పందించిన విధానం తిరిగి కౌశిక్ మెడకు చుట్టుకున్నాయి.

బీఆర్‌ఎస్‌కు  మైలేజ్ కన్నా... డ్యామేజ్ ఎక్కువ..!

కండలు తిరిగిన శరీరాకృతితో కనిపించే కౌశిక్ రెడ్డి, హావభావాలు, మాట్లాడే విధానం, ఎదుటి వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించిన తీరుతో అధికార కాంగ్రెస్ పార్టీ విసిగిపోయింది. అదును చూసి దెబ్బకొట్టింది. అసెంబ్లీ నుంచి సాగనంపేందుకు సిద్దమైంది. అయితే బీఆర్‌ఎస్ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దూకుడుతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందో, మైలేజ్ వస్తుందో, అర్దం కాని అయోమయంలో కనిపిస్తోంది. సమర్థిస్తే పరువు పోతుంది. వెనుకేసుకొస్తే జనం నవ్వుతారేమో అనే దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. 

కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరి, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత జరిగిన వరుస ఘటనల వల్ల పార్టీకి లాభం కంటే, నష్టమే ఎక్కువ. దూకుడు తప్పుకాదు, ఆవేశం తప్పుకాదు, కానీ ఎక్కడ వాడాలో తెలియకపోవడం అతిపెద్ద ముప్పు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అదే జరుగుతోందంటున్నారు రాజకీయ విశ్లేకులు. విమర్శించడం, దాడి చేయడం, అరెస్ట్ అవ్వడం, నోరు జారడం, క్షమాపణలు చెప్పడం.. ఇలా కౌశిక్ రెడ్డికి గత కొంతకాలంగా అలవాటైపోయింది. ఈసారి అసెంబ్లీలో కడియంపై సైగలు చేసి అడ్డంగా దొరికేశాడంటున్న అధికార పార్టీ, భవిష్యత్‌లో మరెవరూ ఇలా మాట్లాడకుండా చేస్తామంటూ చెప్పిమరీ వేటు వేసేందుకు సిద్దమైంది.

Frequently Asked Questions

హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీలో ఎందుకు ఇంత రచ్చ జరిగింది?

సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉండగా, కౌశిక్ రెడ్డి తుపాకీతో కాల్చిపడేస్తానని సైగలు చేసి, అవమానించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కౌశిక్ రెడ్డిపై గతంలో ఎలాంటి ఆరోపణలు, కేసులు నమోదయ్యాయి?

ఒక ఎస్‌ఐపై అనుచితంగా ప్రవర్తించడం, విధులకు ఆటంకం కలిగించడం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేయడం, గ్రానేట్ యజమానిని బెదిరించి డబ్బు డిమాండ్ చేయడం వంటి ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.

కౌశిక్ రెడ్డి పోలీసు అధికారిని దూషించిన ఘటనపై స్పందన ఏమిటి?

సమ్మక్క జాతర సందర్భంగా పోలీసు అధికారిని మతం పేరుతో దూషించారనే ఆరోపణలపై హైడ్రామా చోటుచేసుకుంది. కౌశిక్ రెడ్డి క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేశారు.

కౌశిక్ రెడ్డి తీరుతో బీఆర్‌ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతోంది?

కౌశిక్ రెడ్డి దూకుడు, వివాదాస్పద వ్యాఖ్యల వల్ల పార్టీకి మైలేజ్ కంటే డ్యామేజే ఎక్కువ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget