Ind Vs SA: రెండో టెస్ట్ లో సౌతాఫ్రికా ప్రతీకారం...ఏడు వికెట్ల తేడాతో గెలుపు
సఫారీలు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. జొహన్సెబర్గ్ లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. 240పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ 96 పరుగులతో అజేయంగా నిలబడి తన జట్టును గెలిపించుకున్నాడు డ్యూసెన్, బవుమాలు చివర్లో కెప్టెన్ ఎల్గర్ అద్భుతమైన సహకారాన్ని అందించారు. సెంచరీ మిస్సయినా ఎల్గర్ పోరాటంతో...ప్రొటీస్ సిరీస్ ను సమం చేసుకుంది. తొలుత ఎడతెగని వర్షంతో టీ సమయం వరకూ మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. 1182 ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన సఫారీల ముందు భారత బౌలర్లు తేలిపోయారు. ఇక 11వ తారీఖున జరిగే మూడో టెస్ట్ నిర్ణయాత్మకంగా మారి ఈ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది.





















