Gudivada Casinova : క్యాసినోవాల నిర్వహణ అంటూ టీడీపీ - ఆధారాలుంటే నిరూపించాలంటూ వైసీపీ
గుడివాడలో క్యాసినోవాల నిర్వహణ ఆరోపణలు..రాజకీయ ప్రకపంనలు రేపుతున్నాయి. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటూ టీడీపీ అధినాయకత్వం నిర్దేశించిన నిజనిర్థారణ కమిటీ పర్యటన గుడివాడలో ఉద్రిక్తతలకు దారి తీసింది. టీడీపీ శ్రేణులను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ లు నిర్వహించగా....ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్ట్ లు చేశారు. అయితే టీడీపీ నేతలను అరెస్ట్ చేయటంపై పోలీసులు క్లారిటీ ఇవ్వగా...టీడీపీ నేతలే కావాలని తమను అరెస్ట్ చేయాలని కోరినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ నేతలు...టీడీపీ నాయకుల ఉద్దేశాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరో వైపు టీడీపీ మాత్రం మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని అండతోనే గుడివాడలో క్యాసినోవాలు నడిపారంటూ ఇప్పటికీ తమ వాదనలను వినిపిస్తూనే ఉన్నారు.




















