Elon Musk Tweet On APE: ఓ కోతి వింత చేష్టల వీడియో కి రెస్పాండైన ఎలన్ మస్క్..!
టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఓ ఫన్నీ వీడియో కి రెస్పాండ్ అయ్యారు. అంతే కాదు ఆ వీడియోను షేర్ చేసిన తమిళనాడు ఐఏఎస్ అధికారిని ట్యాగ్ చేసి తన ఫీలింగ్ ను రీట్వీట్ చేశారు ఎలన్ మస్క్. 2020లో తమిళనాడు అడిషనల్ సీఎస్ సుప్రియ సాహూ ఓ చిన్ని వానరం గడ్డిలోకి దూకుతూ ఆడుకుంటున్న వీడియోను షేర్ చేశారు. ఇన్నాళ్ల తర్వాత ఆ వీడియోను మాసిమో అనే పేజ్ రీట్వీట్ చేయగా....దానికి ఎలన్ మస్క్ స్పందించారు. తన కుమారుడు బేబీ 'ఎక్స్' ఇలానే ప్రవర్తిస్తాడంటూ ఫన్నీగా రిప్లై ఇస్తూ...సుప్రియా సాహూను ట్యాగ్ చేశారు ఎలన్ మస్క్. దానికి ప్రతిగా స్మైలీస్ తో రిప్లై ఇచ్చారు తమిళనాడు అడిషనల్ సీఎస్ సుప్రియా సాహూ. ఆమె ప్రస్తుతం తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.





















