ఎన్నికల ప్రచారంలో చెత్త ట్రక్ తోలిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చాలా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతోంది. ముఖ్యంగా ట్రంప్ రకరకాల వేషాలు వేస్తూ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ మధ్యే ఓ రెస్టారెంట్‌లో సర్వర్‌గా పని చేశారు. పిజ్జాలు డెలివరీ చేశారు. ఇప్పుడు మరో ఎలక్షన్ స్టంట్ చేశారు. ప్రచారంలో భాగంగా చెత్త ట్రక్ నడిపారు. ఈ గార్బేజ్ ట్రక్‌పై ట్రంప్ అనే బ్యానర్ తగిలించి ఆయనే స్వయంగా డ్రైవ్ చేశారు. చుట్టూ ఉన్న ఆయన సపోర్టర్స్ కేరింతలు కొడుతూ వీడియోలు, ఫొటోలు తీశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిపబ్లికన్ సపోర్టర్స్‌ని గార్బేజ్ అంటూ విమర్శించారు జో బైడెన్. కమలా హారిస్‌కి వీళ్లంతా పెద్ద తలనొప్పిగా మారారని మండి పడ్డారు. ఆ మరుసటి రోజే ట్రంప్ ఇలా గార్బేజ్ ట్రక్ నడపడం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ సపోర్టర్స్ అంతా సోషల్ మీడియాలో తెగ పోస్ట్‌లు పెడుతున్నారు. "వేరే లెవల్ ట్రోలింగ్" అంటూ బైడెన్‌కి చురకలు అంటిస్తున్నారు. ఇక డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న ట్రంప్..బైడెన్‌తో పాటు కమలా హారిస్‌కి సెటైర్లు వేశారు. "నా గార్బేజ్ ట్రక్ ఎలా ఉంది" అని ప్రశ్నించారు. అంతే కాదు. కమలా హారిస్, బైడెన్‌పై గౌరవంతోనే ఈ పని చేస్తున్నట్టు చెప్పారు.