Australia Akhanda Fans: పోలీసులు ఎంట్రీ, చివరికి ఏమైందంటే..
నందమూరి బాలకృష్ణ అభిమానుల హంగామా మామూలుగా లేదు. ఆస్ట్రేలియాలో వారు చేసిన హంగామాకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్(Brisbane)లోని ఓ థియేటర్లో బాలయ్య అభిమానుల హంగామా చూసి థియేటర్ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. సినిమా ప్రారంభం కాగానే అభిమానులు స్క్రీన్ వద్దకు వెళ్లి జై బాలయ్య అంటూ నినాదించారు. సినిమా నడుస్తున్నంత సేపు.. కేకలు, అరుపులతో రచ్చ చేశారు. దీంతో సినిమాను కాసేపు ఆపేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. థియేటర్‌లోకి వచ్చిన పోలీసులు.. బాలయ్య అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకోండి అని వెల్లడించారు. దీంతో ప్రేక్షకులు కుదురుగా ఉంటామని చెప్పడంతో సినిమా కొనసాగించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















