CM Jagan First reaction | ఎన్నికల్లో ఓటమి తర్వాత కారణాలు చెప్పిన సీఎం జగన్ | ABP Desam
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఏం చేయలేదా అసలు. సరే అభివృద్ధి చేయలేదు. సంక్షేమ పథకాలు అమలు చేశాడు కదా. ప్రతీ కుటుంబానికి లబ్ది చేకూరేలా వాళ్లంతా ఏదో ఒక పథకంలో ఉండేలా వాలంటీర్లతో ఫాలో అప్ చేయించి మరీ సంక్షేమ ఫలాలు అందించాడు కదా. మరి ఎన్నికల ఫలితాల్లో ఎక్కడ తేడా కొట్టింది. 175 నియోజకవర్గాల్లో 151 కొట్టేసిన అదే పార్టీ (YSRCP).. ఇప్పుడు కనీసం పదో నెంబర్ అంకెకు అటూ ఇటూ ఊగిసలాడటం ఏంటి? ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ పంపారు. సిట్టింగ్ సీఎం ఎన్నికల్లో ఓడిపోతే నేరుగా గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖ సమర్పించడం సంప్రదాయం . అయితే జగన్ గవర్నర్ ను కలవడానికి ఇష్టపడలేదు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపినట్లుగా తెలుస్తోంది. రాజీనామా లేఖను ఆమోదించిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని కోరుతూ రాజ్ భవన్ నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే వరకూ జగన్ ఆపద్ధర్మ సీఎంగా ఉంటారు.