BJP Ramchandra Rao | Lok Sabha Results | రాముడికి గుడికట్టినా అయోధ్యలో ఓడిపోయాం
అయోధ్య రామ మందిర నిర్మాణం... కొన్ని దశాబ్దాలుగా ఇది బీజేపీకి ఓట్లు కురిపించిన అంశం. ప్రతి ఎన్నికల్లోనూ వారి మేనిఫెస్టోలో ఇదే ప్రధాన అజెండా. వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టు తీర్పుతో ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆలయ నిర్మాణం పూర్తి చేసి, సరిగ్గా ఎన్నికలు కొన్ని నెలల ముందు అట్టహాసంగా ప్రారంభించారు. ఇది హిందూ ఓట్లను ఏకతాటి పైకి తీసుకొచ్చి, తమకు అనుకూలంగా మారుస్తుందని బీజేపీ భావించింది. కానీ అయోధ్య ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ కూటమి పుంజుకుంది. 80 స్థానాల్లో 40కి పైగా స్థానాల్లో లీడింగ్ లో ఉంది.
ఈశాన్యంలో డీలా...
ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి డీలా పడింది. మణిపూర్ లో మహిళలపై హింస, అకృత్యాలపై విషయంలో మోదీ నేతృత్వంలోని కేంద్రం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కనీసం ఆ ఘటనపై ఓ ప్రకటన కూడా చేయకపోవడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టిగానే ఎండకట్టింది.