Woman Beats RTC Driver in Anantapur | బస్సు ఆపలేదని డ్రైవర్ పై మహిళ దాడి | ABP Desam
ఏపీలో బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై మహిళ దాడి చేసింది. అనంతపూర్ జిల్లా సర్పాల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నడిమివంక వద్ద ఒక మహిళ బస్సు కోసం ఎదురు చూస్తుంది. అప్పుడే అనంతపురం నుండి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బస్సు నడిమివంక వద్ద ఆగకుండా వెళ్ళిపోయింది. దాంతో మహిళకు కోపం వచ్చి బైక్ పై బస్సును ఓవర్ టేక్ చేసి ... బస్సు ఆపి మరి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. డ్రైవర్ కాలర్ పట్టుకుని బస్సు ఎందుకు ఆపలేదంటూ... చెంప పగల కొట్టింది. బస్సులో ఉన్నవారు మహిళను ఆపాలని చూసిన కూడా వినిపించుకోలేదు. దాంతో డ్రైవర్ స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం కానుంది. ఉచిత బస్సు ప్రయాణ పథకం ఇంకా మొదలు కాకముందే ఇలా మహిళ ఏకంగా బస్ డ్రైవర్ ను కొట్టడం ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతుంది.





















