వీడియో: చంద్రబాబుకు ముద్దు పెట్టాలని మహిళ ఉత్సాహం
అనకాపల్లి జిల్లా పరవాడలో పర్యటన సందర్భంగా 74 ఏళ్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒక ఫన్నీ అనుభవం ఎదురైంది. ఓ ఔత్సాహిక మహిళా అభిమాని ముద్దు పెట్టే ప్రయత్నం చేశారు. తొలుత సీఎంకు ఆమె బొకే అందించారు. ఆ తర్వాత చంద్రబాబుకు ముద్దుపెట్టడానికి కొన్నిసార్లు ప్రయత్నించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో సెక్యూరిటీ ఆ ప్రయత్నాన్ని తప్పించారు.
అనకాపల్లి జిల్లా, పెందుర్తి నియోజకవర్గం, వెన్నెలపాలెంలో రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్&బి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. ‘‘రూ.70 వేల కోట్లతో నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుంది. అక్కడ ఒక పెద్ద సిటీనే డెవలప్ అవ్వబోతుంది. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాం. ఆ తరువాత కొత్త రోడ్లపై దృష్టి పెడతాం. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి చేసిన చేతకాని పాలన వల్ల, రోడ్లు పైన వేసిన గుంతలు పూడ్చటానికి, రూ.860 కోట్లు ఖర్చు చేస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.