Tirumala: శ్రీవారిని దర్శించుకున్న మోహన్ బాబు , మంచు విష్ణు, ఇతర 'మా'సభ్యులు
తిరుమల శ్రీవారిని నూతనంగా ఎన్నికైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో సినీనటుడు మోహన్ బాబు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుతో కలిసి మా అసోసియేషన్ సభ్యులు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సినీనటుడు మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నా బిడ్డ ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు..నా బిడ్డని, శ్రీ వేంకటేశ్వరుడు, పరమేశ్వరుడు., షిరిడి సాయి నాథుడు దీవెనలతో పాటు అసోసియేషన్ సభ్యుల దీవెనలతో ప్రెసిడెంట్ గా గెలుపొందాడని ఆయన అన్నారు. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. మా ఎన్నికలు అయిన అనంతరం శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామన్నారు.
![సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/08/dbde055e5e7b4af56214567835e083a51733635388790234_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)