Delhi IIT: తిరుమల ఘాట్ రోడ్ ను పరిశీలించిన ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందం| ABP Desam
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడిన ప్రదేశాలను ఢిల్లీ నుంచి వచ్చిన ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఐఐటీ బృందానికి ఘాట్ రోడ్డు పరిస్ధితిని వివరించారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులో తరచూ కొండ చరియలు విరిగి పడుతున్న క్రమంలో భక్తుల భధ్రత దృష్ట్యా శాశ్వత పరిష్కారం దిశగా టీటీడీ చర్యలు చేపడుతోంది. నిన్న ఉదయం వేకువజామున రెండోవ ఘాట్ రోడ్డులో భారీ బండరాళ్ళు, వృక్షాలు విరిగి పడడంతో నాలుగు ప్రాంతాల్లో ఘాట్ రోడ్డు చివరి అంచు ధ్వంసం అయింది. దీంతో రెండో ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతిని టీటీడీ రద్దు చేసింది. ఢిల్లీ ఐటీ నిపుణుల బృందం ఘాట్ రోడ్డులోని ప్రమాదకర ప్రదేశాలను పరిశీలించి టీటీడీకి నివేదిక సమర్పించనుంది. దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం ఏర్పడిన భారీ పర్వతాలు కావడంతో పరిస్థితిని కూలంకషంగా అధ్యయనం చేయాలని బృందం అభిప్రాయపడింది. అలాగే గతంలో అడపాదడపా విరిగిపడిన కొండచరియలతో పోలిస్తే ప్రస్తుతం జరిగిన ఘటన అత్యంత ప్రమాద కరమైనదని టిటిడి ఇంజనీరింగ్ అధికారి రామచంద్రారెడ్డి తెలిపారు. కేఎస్ రావ్,ఢిల్లీ ఐఐటీ నిపుణులు. రామచంద్రారెడ్డి, టీటీడీ ఇంజనీరింగ్ అధికారి.
![సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/08/dbde055e5e7b4af56214567835e083a51733635388790234_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)