అన్వేషించండి
AP Lorries: ఏపీ వరి ధాన్యం లారీలను అనుమతించని తెలంగాణ
ఏపీ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం సడన్ షాక్ ఇచ్చింది. కర్నూలు జిల్లా నుంచి తెలంగాణ వెళ్లే వరి ధాన్యం లారీలను తెలంగాణ పోలీసులు కర్నూలు శివారులోని పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద ఆపేశారు. దీంతో వరి ధాన్యం లారీ లోడ్లు జాతీయ రహదారిపై నిలిచి పోయాయి. ఎలాంటి ప్రకటన లేకుండా ఎలా ఆపేస్తారని కేసీఆర్ ప్రభుత్వంపై లారీ డ్రైవర్ లు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఏపి నుంచి వచ్చే వరి ధాన్యంను కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ సియం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకు న్నారని రైతులు ఆరోపిస్తు న్నారు. అధికారులు అనుమతించకపోవటం తో వెనుదిరిగారు లారీ డ్రైవర్లు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం





















