Raghurama Krishnam Raju - CM Ramesh: తిరుమలలో రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేష్
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు, ఎంపీ సీఎం రమేష్ శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు బాధ్యతలు తీసుకుంటున్నారు. అయితే పదవిలో ఉన్నంత కాలం వారికి వచ్చే శాలరీ ఎంత ఇతర సౌకర్యాలు ఏముంటాయనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు జీతమెంత? పవన్ ఎంత జీతం తీసుకోబోతున్నారు? ఎమ్మెల్యేలకు నెలకు ఎంత వస్తుంది? వీరికున్న సౌకర్యాలేంటి? దేశంలోని వివిద రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల జీతాల సంగతేంటి? వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల వేతనాలు ఎలా ఉంటాయి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు, శాసన సభ్యులకు వేతనాలు, వివిధ రకాల భత్యాలతో పాటు ఆయా ప్రభుత్వాలు ఇతర సౌకర్యాలు సైతం కల్పిస్తున్నాయి. దేశమంతటా ఈ జీత భత్యాలు ఒకేలా ఉండట్లేదు. ఆయా ప్రభుత్వాల ముఖ్యమంత్రుల నిర్ణయం ప్రకారం ఇది మారుతూ ఉంటుంది. సాధారణంగా శాసన సభకు ఎన్నికైన ప్రతి సభ్యునికి వేతనంతో పాటు ఉండేందుకు ఎమ్మెల్యే క్వార్టరు లేదా.. హౌస్ రెంట్ ఎలవెన్స్, అసెంబ్లీకి అటెండ్ అయ్యేందకు సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ అలవెన్స్, నియోజకవర్గ ఎలవెన్స్, కంటిజెన్సీ అలవెన్స్, కన్వెయన్స్ అలవెన్స్ సెక్రటేరియట్ ఎలవెన్స్‌లు కూడా ఇస్తున్నారు.