Pawan Kalyan Inspirational Journey | అన్నను మించిన తమ్ముడిగా పవన్ | ABP Desam
తండ్రిని మించిన తనయుడు......గురువును మించిన శిష్యుడు.... ఇప్పుడు చెప్పుకోవాల్సింది.. అన్నను మించిన తమ్ముడు. అవును అన్న చూపిన మార్గంలో ప్రయాణంప్రారంభించిన తమ్ముడు.. అన్నను మించి పోయాడు. ఈ పరిచయం ఎవరి కోసమో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్న చేయి పట్టుకుని సినిమాల్లో అడుగుపెట్టాడు పవన్. అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి తో సినిమా అరంగ్రేటం చేసిన పవన్ కు ఆ సినిమా పెద్ద డిజాస్టర్. అన్న మెగాస్టార్ అయినా ......తనకు తానుగా నిరూపించకపోతే... పూలు విసిరిన చేతులతోనే..రాళ్లు విసురుతారని ఆ సినిమాతోనే గ్రహించిన పవన్. అప్పటి నుండి తన కేరీర్ లో తీసుకునే ప్రతీ నిర్ణయం.. ఓ ట్రెండ్ సెట్ చేసేలా ఉంది. ఓ సినిమాలో పవన్ చెప్పినట్లు ట్రెండ్ ఫాలో కాలేదు.. తనే ట్రెండ్ సెట్ చేశాడు.. చిరంజీవి అభిమాణ గణంతో పోటీ పడేలా... పవన్ తన పవనిజంతో, స్వంత ఇమేజ్ తో... ఒక్క మాటలో చెప్పాలంటే.. కట్టర్ అభిమానులను సంపాదించుకున్నారు. ఎంతలా అంటే చిరంజీవి సినిమా నుండి ఆ కొణిదెల ఫ్యామిలీలో ఎవరి సినిమా ఫంక్షన్ అయినా సరే పవన్ పేరు చెప్పాల్సిన పరిస్థితి. లేదంటే.. ఆ ఫంక్షన్ సంగతి అంతే.. పవన్ అభిమానుల అల్లరి, సందడితో... ఏ హీరో మాట్లాడలేని పరిస్థితి. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని తెలుగు సినిమా పరిశ్రమలో పవన్ ఓ స్టార్ గా అన్నను మించిన తమ్ముడు అన్నంతగా పేరు సంపాదించుకున్నారు.