అన్వేషించండి
Vizianagaram: వైభవంగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం
ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీపైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండువుగా జరిగింది. విజయనగరంలో అమ్మవారు వెలసిన పెద్దచెరువులో తెప్పోత్సవం ఘనంగా జరిగింది. పైడితల్లి సిరిమానోత్సవం అనంతరం పెద్దచెరువులో విహరించిడం వందల ఏళ్లనాటి ఆచారం. అందంగా అలంకరించిన తెప్పలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో ఆలయ అధికారులు, భక్తులు తీసుకొచ్చారు. జై జై పైడితల్లమ్మ అంటూ భక్తులు నినాదాలు చేశారు.
వ్యూ మోర్





















