అన్వేషించండి
SONU SOOD: నెల్లూరు జిల్లాకు చేరిన సోనూ సూద్ వరద సాయం..
కరోనా లాక్ డౌన్ టైమ్ లో వలస కార్మికులపట్ల దేవుడిలా మారి సాయం చేసిన సోనూ సూద్.. ఇప్పుడు నెల్లూరు జిల్లావాసులకు అండగా నిలబడ్డారు. దాదాపు 2వేల కుటుంబాలకు ఆయన తన సాయాన్ని పంపించారు. ప్లాస్టిక్ బకెట్, చాప, దుప్పట్లు, ఇతర నిత్యావసరాలను పంపించారు సోనూ సూద్. కోవూరు మండలంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సోనూ సూద్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు, సాయాన్ని అందించారు. స్థానిక నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వ్యూ మోర్





















