అన్వేషించండి
చలో విజయవాడ ఎఫెక్ట్.. నెల్లూరులో అడుగడుగునా పోలీస్ తనిఖీలు
చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి ప్రభుత్వం అడుగడుగునా పోలీసుల్ని మోహరించింది. నెల్లూరు జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 200మంది ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లాలో మొత్తం 72 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలోని టోల్ గేట్ ల వద్ద బస్సులు, కార్లు, ఆపి చెక్ చేస్తున్నారు. మీరు టీచరా, రెవెన్యూ ఉద్యోగా అంటూ ప్రయాణికుల్ని ఆరా తీస్తున్నారు. అదే సమయంలో అనుమానం వస్తే వారి వాట్సప్ కూడా చెక్ చేస్తున్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని, ఎవరూ నిబంధనలు ఉల్లంఘించొద్దని సూచించారు జిల్లా పోలీసులు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్





















