అన్వేషించండి
Nellore Marripadu Tobacco Farmers : పొగాకు సాగుకి సహకరించండి.. లేదా పంటను రద్దు చేయండి | ABP Desam
గుంటూరు జిల్లా తర్వాత ఏపీలో పొగాకు పంటకు నెల్లూరు జిల్లా పెట్టింది పేరు. నెల్లూరులోని మెట్ట ప్రాంతాల్లో పొగాకుని విస్తారంగా సాగు చేస్తుంటారు. జిల్లాలోని మర్రిపాడు, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి, దుత్తలూరు తదితర మండలాల్లో విస్తారంగా పొగాకు సాగు చేస్తున్నారు. అయితే ప్రతి ఏడాదీ పంట చేతికొచ్చాక రేట్లు పడిపోవడం వీరికి అలవాటే. గతేడాది కూడా పంట దిగుబడి బాగా వచ్చింది, కానీ రేటు తగ్గిపోవడంతో రైతులు అప్పులపాలయ్యారు. ఈ ఏడాది వర్షాల కారణంగా పంటకు పురుగు పట్టింది. దీంతో అసలు దిగుబడే ప్రశ్నార్థకంగా మారింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్





















