అందరికీ ఆధార్ ఓ వరం. ఆధార్ కార్డ్ తో అన్ని పథకాలు అందిపుచ్చుకోవచ్చు. కానీ కొంతమంది గిరిజనులు, సంచార జాతులకు మాత్రం ఆధార్ ఇంకా అందనంత దూరంలోనే ఉంది. సంచార జాతుల్లో సగటున 50 శాతం మంది గిరిజనులకు ఆధార్ కార్డ్ అంటే ఏంటే తెలియని వాళ్లున్నారని నెల్లూరు జిల్లాలో అధికారులు గుర్తించారు.కేవలం గిరిజనులు, సంచార జాతుల కోసమే ఓ వినూత్న ప్రయత్నం చేశారు. నగరంలో ఓ ఆధార్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఎలాంటి పత్రాలు లేకపోయినా, వారివద్ద వివరాలు సరిగా ఉంటే.. అక్కడికక్కడే ఆధార్ నమోదు చేసుకుంటారు. గిరిజనులు, సంచార జాతుల వారికి ఆధార్ కష్టాలు లేకుండా చేసేందుకు ఐటీడీఏ పీవో కనకదుర్గా భవాని తెలిపారు.శాశ్వత ఆధార్ కేంద్రంతోపాటు.. సంచార ఆధార్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారామె. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 5 మొబైల్ ఆధార్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. టీపీ గూడూరు మండలంలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు, మంచి ఫలితాలు సాధించారు. ఇప్పటి వరకూ 1400మందికి పైగా ఆధార్ లు అందించారు. వారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా చేయడం సంతోషాన్నిచ్చిందని చెబుతారామె.
Atmakuru Bye Election Arrangements: ఆత్మకూరు ఉపఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష | ABP Desam
Kotamreddy Sridharreddy Hospitalized: తీవ్రమైన ఛాతీ నొప్పితో హాస్పిటల్ లో చేరిన కోటంరెడ్డి| ABP Desam
Anil Kumar Yadav : నమ్మకం ఉంటేనే వెన్నుపోటు పొడుస్తారు! | Nellore News | ABP Desam
Nellore Teachers Association Dharna: సీఎం జగన్ కు అల్టిమేటం ఇచ్చిన నెల్లూరు టీచర్స్ అసోసియేషన్
Gold Mines Found In Nellore Distrcit: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో జీఎస్ఐ సర్వే|ABP Desam
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!