Minister Nara Lokesh Entry AP Assembly | ఏపీ అసెంబ్లీలో తొలిసారి MLAగా అడుగుపెట్టిన లోకేశ్ | ABP
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్యేగా తొలి సారి ఏపీ అసెంబ్లీకి వచ్చారు. గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేశ్...శాసనమండలికి ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా గతంలో పలుసార్లు ఏపీ అసెంబ్లీకి వచ్చినా ఎమ్మెల్యే గా లోకేశ్ అడుగుపెట్టడం మాత్రం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్ శాసనభ సమావేశాలు ప్రారంం కాగానే ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయించారు. ముందుగా చంద్రబాబు ప్రమాణం చేశారు.చంద్రబాబు శపథాన్ని గుర్తు చేసుకుంటున్న టీడీపీ సభ్యులు నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచిందని ప్లకార్డులు పెట్టుకొని నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రుల తర్వాత వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. వాస్తవంగా అల్ఫాబేటిక్ ఆర్డర్‌లో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉండాల్సింది కానీ వైసీపీ అభ్యర్థన మేరకు ఆయనతో ముందుగానే ప్రమాణం చేయించారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ముటకట్టుకున్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగాల్సి వస్తోంది. జగన్ కంటే ముందే లోకేశ్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.