అన్వేషించండి
Kurnool: కర్నూలు జిల్లా లో కొలతలు తూనికలు శాఖ ఆకస్మిక తనిఖీలు
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కొలతలు తూనికలు శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.పట్టణములోని పలు దుకాణాలను తనిఖీ చేశారు. పండ్లు వ్యాపారులు వాడుతున్న తూనికలు తనిఖీ చేయగా రబ్బర్లు వాడుతూ కొలతల్లో మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హోల్ సేల్ దుకాణల్లోనూ భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించి వారిపై కేసునమోదు చేశారు. కొన్ని చోట్ల పలకను కట్టి జీరో పెట్టి సుమారు 120 గ్రాములు వినియోగదారుల కు టోకరా వేస్తున్నారు.ఇటువంటి దారుణాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు వ్యాపారులను హెచ్చరించారు.
వ్యూ మోర్





















