INS Arnala War Ship | INS అర్నాలా ప్రత్యేకతలు ఇవే | ABP Desam
విశాఖపట్టణంలోని నావల్ డాక్‌యార్డ్‌లో ఇండియాస్ ఫస్ట్ యాంటీ-సబ్‌మరైన్ వార్‌ఫేర్ వాటర్ క్రాఫ్ట్ అర్నాలా జాతికి అంకితం అయింది. ఇది ఒక చరిత్రమక ఘట్టం అనే చెప్పాలి. తీరా ప్రాంతాల్లో శత్రు దేశాల సబ్‌మరైన్స్ ని ఎదుర్కోవడంలో ఎంతో సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ వార్ షిప్ 80 శాతం కంటే ఎక్కువ మన ఇండియన్ టెక్నాలజీతోనే తయారు చేసారు.
మహారాష్ట్రలోని హిస్టారికల్ అర్నాలా కోట పేరునే ఈ షిపికి పెట్టారు. దీని క్రస్ట్ లో స్టైలైజ్డ్ ఆగర్ షెల్ ఉంటుంది. వచ్చే సవాళ్లను జాగ్రత్తగా ఎదుర్కోవాలని ఈ క్రస్ట్ సూచిస్తుంది. అలాగే ఈ షిప్ మోటో అర్ణవే శౌర్యం. సముద్రంలో వీరత్వం అని అర్థం.
అర్నాలా వార్ షిప్ ని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ .. ఎల్ అండ్ టీ షిప్‌బిల్డర్స్ కలిసి నిర్మించాయి. దీని పొడవు 77.6 మీటర్ల, బరువు 1,490 టన్నులు. డీజిల్ ఇంజిన్-వాటర్‌జెట్ ప్రొపల్షన్ తో దీనికి పవర్ వస్తుంది. ఈషిప్ గంటకు 25 నాట్స్ స్పీడ్ తో వెళ్తుంది. సముద్రంలో జరిగే షాలో ఆపరేషన్స్ కి చాలా ఉపయోగపడుతుంది. అర్నాలా షిప్ సబ్‌సర్ఫేస్ సర్వైలెన్స్, సెర్చ్, రెస్క్యూ మిషన్స్ ని కూడా చేయగలదు. అలాగే లైట్‌వెయిట్ టార్పెడోలు, యాంటీ-సబ్‌మరైన్ రాకెట్ ని ఈ షిప్ శత్రువు సబ్ మరై న్స్ పై వేయగలదు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మహీంద్రా డిఫెన్స్, MEIL, 55 MSME సంస్థలు మోడ్రన్ టెక్నాలజీతో ఈ షిప్ ని తయ్యారు చేయడంలో భాగం అయ్యాయి. ఈ ఒక షిప్ 7,500 కిలోమీటర్స్ ఇండియా కోస్ట్ లైన్ ని రక్షించగలదు. పాక్, చైనా వంటి దేశాలను తీరప్రాంతాల్లో ఎదుర్కోవడానికి INS ఆర్నాలా కీలక పాత్ర పోషిస్తుంది. కమాండ్ సిస్టమ్ నావల్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో కలిసి దాడులు చేయగలదు. 16 ASW-SWC వార్ షిప్స్ లో అర్నాలా మొదటిది. 2028 నాటికి మిగితావి కూడా ఇండియన్ నేవీలో భాగమైయే ఛాన్స్ ఉంది. వీటిని GRSE, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ విలువ 13,000 కోట్లు. ఈ వార్ షిప్స్ ఇండియన్ నేవీకి మరింత బలం చేకూర్చనున్నాయి.





















