Vamsadhara Flood Gotta Barrage | భారీ వర్షాలతో వంశధారకు పోటెత్తుతున్న వరద | ABP Desam
కుండపోత వర్షాలతో ఉత్తరాంధ్రలో వాగులు,నదులు పోటెత్తుతున్నాయి. వంశధార, నాగావళి నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తగా ఎక్కడా గట్లు తెగకుండా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హీరమండలం వంశధార గొట్టా బ్యారేజ్ వద్ద వరద పరిస్థితి ఈ వీడియోలో చూడొచ్చు. ఎగువన కురుస్తున్న వర్షాలకు వంశధారతో పాటు నాగావళి నది కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అందుకే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా వంశధార, నాగావళి పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరింత వరద పెరిగే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్నా ఇప్పటికీ పలు గ్రామాల్లో ప్రజలు ముంపునకు గురవుతున్నారు. గొట్టా బ్యారేజ్ లో ప్రస్తుతం వరద ఉద్ధృతిపై పూర్తి వివరాలు ఈ వీడియోలో నూ చూసేయండి.