జవాద్ తుఫాను వల్ల రైతులకు అపార పంట నష్టం, ప్రజలు దాదాపు 69 మంది ప్రాణాలు కోల్పోయారని మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కడప జిల్లా కమలాపురం లో నష్టపోయిన పంట పొలాలను, కూలిపోయిన పాపాగ్ని వంతెన ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వరద బీభత్సాన్ని జాతీయ విపత్తు గా ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ లో మృతి చెందిన వారికి కోటి రూపాయలు పరిహారం ఇచ్చిన సీఎం జగన్ సొంత జిల్లాలో 5 లక్షలు పరిహారం ఇవ్వడమేంటో అర్థం కావటం లేదన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. నెల్లూరు లో అమరావతి రైతుల పాదయాత్ర కు స్థానిక ఎమ్మెల్యే ఆటంకాలు కలిగించడం తగదన్నారు.
Scam Exposed in GDCC: నకిలీ బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు | ABP Desam
YCP Announces Rajyasabha Candidates: ఇద్దరు రెడ్డి, ఇద్దరు బీసీలకు అవకాశం | ABP Desam
CPI Ramakrishna On YS Jagan: సీఎం జగన్ పై విరుచుకుపడిన సీపీఐ రామకృష్ణ|ABP Desam
Vijayawada Municipal Corporation Council Meet: టీడీపీ సభ్యుల సస్పెన్షన్ నేలపై పడుకుని నిరసన|ABP Desam
Nellore Teachers Association Dharna: సీఎం జగన్ కు అల్టిమేటం ఇచ్చిన నెల్లూరు టీచర్స్ అసోసియేషన్
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు