ATM Robbery in Malkajgiri | నాకాబందీ జరిగిన గంటల్లోనే ఏటీఏంలో చోరీ
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు పోలీసులకు సవాలు విసిరారు. జులై 8న రాత్రి బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. ఈ నాకబందీలో 50 మంది పోలీసులతో తనిఖిలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 3ఆటోలు,1 కార్ తో పాటు ఓ బెల్ట్ షాప్ లో తనిఖీ చేయగా 20 లీటర్ల మద్యం దొరికిందని బాల్ నగర్ ఏసిపి నరేష్ రెడ్డి తెలిపారు.
అనంతరం మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఏరియాలో నాకాబందీ నిర్వహించిన 4 గంటల్లోనే గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలో చోరికి పాల్పడ్డారు. మార్కండేయ నగర్ లో ఉన్న హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ఏటిఎంలో చోరీ చేశారు దొంగలు. గ్యాస్ కట్టర్స్ సహయంతో ఏటిఎం మిషన్ లో డబ్బులు అప్‌లోడ్ చేసే బాక్సును దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.




















