అన్వేషించండి
Advertisement
CM Jagan Tirumla Visit: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ పంచకట్టుతో తిరుమలేశుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు. తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ప్రారంభించారు. అంతకు ముందు తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేరుకున్న సీఎం పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రసంగం మధ్యలోనే ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
అమరావతి
మొబైల్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement