ముఖ్యమంత్రి వెళ్లకపోవటానికి కారణం అదేనా ?
పిఎం నరేంద్రమోడి హైదరాబాద్ పర్యటన ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పిఎం ఏ రాష్ట్రానికి వచ్చినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎయిర్ పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకుంటారు. కానీ ఈ సారి నరేంద్రమోడి పర్యటనలో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి పిఎం ను రిసీవ్ చేసుకోవడంలేదు. దీనికి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కేసీఆర్, మంత్రి తలసానిని పీఎం పర్యటన నిమిత్తం రిసీవ్ చేసుకోటానికి నియమించారు.ప్రధాన మంత్రి షెడ్యూల్ మధ్యాహ్నం 2.10 కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు . 2.45 నుండి 4.15 వరకు ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ ప్రారంభ కార్యక్రమం లో పాల్గొంటారు. 5 గంటలకు ముచ్చింతల్. 5 గంటల నుండి 8 గంటల వరకు సమతా మూర్తి విగ్రహవిష్కరణ కార్యక్రమం లో పాల్గొంటారు. 8.20 కి హైదరాబాద్ నుండి ఢిల్లీ కి తిరుగు ప్రయాణం అవుతారు.





















