Viral Video: కూతురికి ఏం గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చావు కాకా! అట్లుంటది మనతోని!
ఓ తండ్రి తన కూతురుకు చెప్పిన గ్రాండ్ వెల్‌కమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంట్లో ఆడపిల్ల పుడితే భారంగా భావించే రోజులు పోయాయ్. ఇప్పుడు మగబిడ్డ కంటే ఆడిపిల్ల పుడితే గారబంగా చూసుకుంటున్నారు. నెమ్మదిగా మనుషుల ఆలోచనా విధానంలోనూ మార్పులు వచ్చాయి. ప్రభుత్వాలు కూడా ఆడబిడ్డలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాలు కూడా అమలు చేస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా వివక్ష కొనసాగుతోంది. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా అలాంటి వాళ్లలో కూడా మార్పు వస్తుంది. అవును తన కూతురుకి ఓ తండ్రి ఇచ్చిన గ్రాండ్ వెల్‌కమ్ చూసి అందరూ షాకయ్యారు.
గ్రాండ్ వెల్‌కమ్
To make our daughter's homecoming special, we arranged a chopper ride worth Rs 1 lakh. We did not have a girl child in our entire family, said the father
— ANI (@ANI) April 5, 2022
(Pic source: Family) pic.twitter.com/K3Pd4rSkbL
మహారాష్ట్ర పుణెలో తమ కుతూరికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన ఓ నాన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. షేల్గావ్ కు చెందిన విశాల్ జరేకర్‌కు ఇటీవల కూతురు పుట్టింది. దీంతో తెగ సంబర పడిపోయాడు. ఎందుకంటే తమ వంశంలో తొలిసారి ఒక ఆడపిల్ల పుట్టింది. ఇంకేముంది తన కూతురికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పాలని డిసైడై పోయాడు.
వెంటనే తన కూతురి కోసం ప్రత్యేక ఛాపర్ రైడ్‌ను ఏర్పాటు చేశాడు. తన ఇంటి సమీపం వరకు హెలికాప్టర్‌లో వచ్చారు. .ఆ తర్వాత బంధువులు, స్నేహితుల మధ్యలో తన కూతురికి స్పెషల్‌గా వెల్‌కమ్ చెప్పాడు. ఇందుకు రూ.లక్ష ఖర్చు పెట్టాడు ఆ తండ్రి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవతుంది.
#WATCH Shelgaon, Pune | Grand Homecoming ! A family brought their newborn girlchild in a chopper
— ANI (@ANI) April 5, 2022
We didn't have a girlchild in our entire family. So, to make our daughter's homecoming special, we arranged a chopper ride worth Rs 1 lakh:Vishal Zarekar,father
(Source: Family) pic.twitter.com/tA4BoGuRbv
మారాలి
ఈ వీడియో చూసిన చాలా మంది ఈ తండ్రి ఎందరికో ఆదర్శమని ట్వీట్ చేస్తున్నారు. ఆడపిల్లలను ఇలానే చూసుకోవాలంటున్నారు. అయితే, తమ ఇంట్లొ ఆడపిల్ల పుడితే లక్ష్మీ స్వరూపం తమ ఇంట్లో పుట్టిందని చాలా మంది సంతోషిస్తారు. వారిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు.
Also Read: Basavaraj Bommai on KTR: కేటీఆర్‌కు కర్ణాటక సీఎం కౌంటర్- బాలయ్య డైలాగ్‌తో బొమ్మై ఫైర్
Also Read: Mystery: ఆ బీచ్‌లో గుసగుసలు వినిపిస్తాయి, మాట్లాడేదెవరో తెలియదు, అదో మిస్టరీ