Viral Video: ఇదేం ఫ్రస్ట్రేషన్‌రా బాబూ! ఎయిర్‌పోర్ట్‌లో యువతి వీరంగం!
Viral Video: విమానం ఎక్కకుండా ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్నారన్న కోపంతో ఓ యువతి వీరంగం సృష్టించింది.

Viral Video: కొంతమందికి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా తట్టుకోలేరు. కొంత మందికి కోపం వస్తే చుట్టుపక్కల ఉన్న వస్తువుల పని అయిపోయినట్లే. మరి కొంతమంది కోపంలో ఏం చేస్తారో వారికే తెలియదు. తాజాగా ఓ యువతి అలానే చేసింది. విమానాశ్రయంలో సిబ్బంది తనను ఆపడం వల్ల ఫ్లెయిట్ మిస్సయింది. దీంతో ఆ యువతి ఏం చేసిందో మీరే చూడండి.
Moment woman throws punches at Emirates airline employee and hurls objects at bystanders after
— Hans Solo (@thandojo) November 7, 2022
missing her flight at #MexicoCity airport pic.twitter.com/sHsPEKkWzl
ఇదీ జరిగింది
మెక్సికోలో ఎమిరేట్స్ అనే అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళను అధికారులు తనిఖీ చేసేందుకు ఆపారు. అయితే తనిఖీ చేస్తున్న సమయంలోనే ఆమె వెళ్లాల్సిన ఫ్లైట్ వెళ్లిపోయింది. దీంతో ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. అక్కడ ఉన్న మహిళా అధికారిపై పిడి గుద్దులతో దాడి చేసింది. అంతటితో ఆగకుండా అక్కడ ఉన్న కంప్యూటర్‌లను అన్నింటి విసిరేసి వీరంగం సృష్టించింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఆ యువతి గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌తో విమానం ఎక్కేందుకు ప్రయత్నించిందని అందుకే ఆమెను అడ్డుకున్నామని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. తాము అడ్డుకున్నామన్న కోపంతో ఆమె తమను దుర్భాషలాడి, దాడి చేసినట్లు వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకుముందు
ఇటీవల గాల్లో ఎగురుతున్న విమానంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. సిబ్బందితో గొడవ పడుతూ విమానం కిటికీ అద్దాలు బద్దలుకొట్టేందుకు యత్నించాడు. పెషావర్ నుంచి దుబాయ్వెళ్తున్న విమానంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. దుబాయ్ వెళ్లేందుకు పెషావర్ విమానాశ్రయంలో ఆ యువకుడు ఫ్లైట్ ఎక్కాడు. అయితే, ఎక్కే సమయంలో సక్రమంగానే ఉన్న సదరు వ్యక్తి.. విమానం టేకాఫ్ అయిన తర్వాత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
A passenger onboard #Pakistan International Airlines #Peshawar-#Dubai flight created a ruckus midflight as he suddenly started punching seats, kicking the aircraft's window and indulging in a brawl with the flight crew.
— Chaudhary Parvez (@ChaudharyParvez) September 19, 2022
Later Passenger blacklisted by Pak airlines.#PIA pic.twitter.com/gGdDpvdfcw
ముందుగా చొక్కా విప్పేసిన యువకుడు ఆపై విమాన సిబ్బందితో గొడవకు దిగాడు. కోపంతో విమానం కిటికీలను కాళ్లతో తన్ని వాటిని పగలగొట్టేందుకు యత్నించాడు. అనంతరం కింద బోర్లా పడుకుని వింత చేష్టలు చేశాడు. ఆ వ్యక్తి ప్రవర్తనతో విసిగిపోయిన విమాన సిబ్బంది.. మిగతా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అతడిని నిరోధించేందుకు విమానయాన చట్టం ప్రకారం సీటుకు కట్టేశారు.
Also Read: COP27 Event: రిషి చర్యలు ఊహాతీతం- బ్రిటన్ ప్రధాని అంత హడావిడిగా ఎక్కడికి వెళ్లినట్లు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

