Snake In Toilet: బాత్రూమ్‌లో పాము, టాయిలెట్ పేపర్ చుట్టుకుని పాట్లు, ఇదిగో వీడియో
బాత్రూమ్‌లోకి దూరిన పాము.. టాయిలెట్ పేపరును చూసి ఏమనుకుందో.. అందులోకి దూరి ముప్పు తిప్పలు పడింది.
![Snake In Toilet: బాత్రూమ్‌లో పాము, టాయిలెట్ పేపర్ చుట్టుకుని పాట్లు, ఇదిగో వీడియో Viral Video of King Cobra Enters Bathroom, Wraps Toilet Paper Around Itself goes viral Snake In Toilet: బాత్రూమ్‌లో పాము, టాయిలెట్ పేపర్ చుట్టుకుని పాట్లు, ఇదిగో వీడియో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/01/36afc47e2e698d8c5cf52b8dd5e16d8e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వేసవి కాలం వచ్చిందంటే పాముల బెడద పెరిగిపోతుంది. ఎండ వేడి తట్టుకోలేక అవి ఇళ్లలోకి దూరిపోతుంటాయి. కాబట్టి, మీరు బాత్రూమ్ లేదా టాయిలెట్‌లోకి వెళ్లే ముందు తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే.. ఇలాంటి ఘటనటే చోటుచేసుకుంటాయి.
ఓ పాము అనుకోకుండా బాత్రూమ్‌లోకి దూరింది. మరి, ఆ తర్వాత ఏం చేసిందో ఏమో.. టాయిలెట్ పేపరుకు ఉండే గొట్టంలోకి దూరింది. దీంతో ఆ పాము టాయిలెట్ పేపర్ రోల్‌లో చిక్కుకుపోయింది. టాయిలెట్‌లో శబ్దం విని.. ఆ ఇంటి యజమాని డోరు తెరిచి చూశాడు. అంతే, అతడికి గుండె జారినట్లయ్యింది. టాయిలెట్ పేపరులో చిక్కుకున్న పాము.. ఆ బాత్రూమ్ నుంచి బయట పడేందుకు ప్రయత్నించడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
Also Read: డయాబెటిక్ రోగులకు శుభవార్త, రోజూ కాఫీ తాగితే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు
అయితే, ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలీదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. మీకు పాములంటే భయం లేకపోతే ఈ వీడియోను చూడవచ్చు. ఈ వీడియోలో ఉన్న సాదాసీదా పాము కాదు. పాములకే బాస్.. నాగు పాము. ఇదిగానీ కాటేస్తే స్పాట్‌లోనే చనిపోతారు. కాబట్టి, మీరు ఇలాంటి విషపూరిత పాములకు చిక్కకుండా ఉండాలంటే.. తప్పకుండా టాయిలెట్ చేసుకోండి. విసర్జనకు కూర్చొనే ముందు ఫ్లష్ కూడా చేయండి. దానివల్ల లోపల ఏమైనా ప్రమాదకర జీవులుంటే బయటకు పోతాయి.
Also read: ఎలాంటి ఆహారాలు తింటే రక్తనాళాలు మూసుకుపోతాయో తెలుసా? ఇదిగో ఇవే
View this post on Instagram
Also Read: వేసవిలో వేడి నీటితో స్నానం చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)