అన్వేషించండి

Viral Video: అరెరే హమ్మింగ్ బర్డ్ కలర్‌ మారిపోతోందే, ఇదెలా సాధ్యమవుతుందబ్బా..

రంగులు మార్చుతున్న హమ్మింగ్ బర్డ్ వీడియో వైరల్ అవుతోంది. ఈకల్లోని స్పెషాల్టీ వల్లే కలర్స్ మారిపోతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.

రంగులు మార్చుతున్న హమ్మింగ్ బర్డ్ 

హమ్మింగ్‌ బర్డ్‌ గురించి తెలియని వాళ్లెవరుంటారు చెప్పండి. ముందుకే కాదు వెనక్కైనా ఎగరగలదీ పక్షి. చాలా అరుదుగా కనిపించే ఈ పక్షుల్ని 
వీడియోల్లో చూస్తూ మురిసిపోతుంటారు. హమ్మింగ్‌ బర్డ్‌ని ఎప్పుడు ఏ వీడియో తీసినా ట్రెండ్ అయిపోవాల్సిందే. సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ ఉందీ పక్షికి. ఇప్పుడు మరోసారి వైరల్ అయింది ఈ బర్డ్. ముందుకు, వెనక్కి ఎగరటంలోనే కాదు. రంగులు మార్చటంలోనూ మంచి టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకుంది హమ్మింగ్ బర్డ్. ప్రతి కదలికకు ఓ రంగు మార్చుతూ కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు 

ఓ వ్యక్తి చేతిపై ఉన్న హమ్మింగ్ బర్డ్ డార్క్ గ్రీన్‌ నుంచి బ్లాక్‌ కలర్‌లోకి మళ్లీ బ్రైట్‌ పింక్‌లోకి మారుతూ ఆశ్చర్యపరిచింది. ఇది గమనించిన ఆ వ్యక్తి వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హమ్మింగ్ బర్డ్ తన మెడ తిప్పిన ప్రతిసారీ ఓ రంగు మారుతుండటాన్ని చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. వేలాది మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ రంగులు మార్చే పక్షిని చూసి కామెంట్ సెక్షన్‌లో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి అద్భుతాన్ని చూడలేదని కొందరు, అద్భుతం అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలా ఎలా రంగులు మారిపోతున్నాయంటూ ఆశ్చర్యపోతున్నారు. మొదట ఇది చూసిన వ్యక్తి తన కళ్లను తానే నమ్మలేకపోయాడట. చాలా సేపు గమనించి వెంటనే లోపలకు పరిగెత్తుకుని కెమెరా పట్టుకొచ్చాడట. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన ఆ వ్యక్తి మెల్లగా ఆ పక్షిని వేలిమీదకు తీసుకున్నాడు. అది ఎగిరిపోకుండా జాగ్రత్తపడుతూ వీడియో తీశాడు. ఈ ఎక్స్‌పీరియెన్స్‌ని లైఫ్‌లో మర్చిపోలేనని అంటున్నాడా వ్యక్తి.  

రంగులు మారటం వెనక కథ ఇది..

ఇంతకీ హమ్మింగ్‌ బర్డ్ రంగులు మార్చటం వెనక మిస్టరీ ఏంటో శాస్త్రవేత్తలు వివరణ ఇస్తున్నారు. ఈ పక్షుల ఈకలు రకరకాల రంగుల్లో ఉంటాయట. అయితే ఎప్పుడైతే పక్షి కదులుతుందో అప్పుడు ఈ ఈకలు ఓ షేప్‌కి వచ్చేస్తాయి. ఆ షేప్‌లో ఏయే రంగుల ఈకలు దగ్గరవుతాయో అవన్నీ కలిసి ఓ కలర్‌గా ఫామ్ అయిపోతాయ్. అంటే పక్షి కదిలిన ప్రతిసారీ ఇలానే జరుగుతుందన్నమాట. ఉదాహరణకు పింక్‌ కలర్‌లోని ఈకలన్నీ కలిసి ఓ షేప్ ఫామ్ చేశాయనుకుంటే అదే రంగులో పక్షి కనిపిస్తుంది. హమ్మింగ్‌బర్డ్‌కి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఇదని, వీడియో బయటకు రావటం వల్ల అందరికీ ఆ స్పెషాల్టీ ఏంటో తెలిసిందని అంటున్నారు సైంటిస్టులు. సో..రంగులు మారటం వెనక కథ ఇదన్నమాట. 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

భారత్ వాకిట్లో యుద్ధం: వైజాగ్ నుంచి వెళ్లిన ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. హిందూ మహాసముద్రంలో ఏం జరిగింది?
భారత్ వాకిట్లో యుద్ధం: వైజాగ్ నుంచి వెళ్లిన ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. హిందూ మహాసముద్రంలో ఏం జరిగింది?
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
Iran War: US-ఇజ్రాయెల్ త్రిముఖ వ్యూహం: ఇరాన్ ఎయిర్‌ డిఫెన్స్ ఎందకు ఆపలేకపోయిందంటే..!
యూఎస్-ఇజ్రాయెల్ త్రిముఖ వ్యూహం; ఆకాశం మూగబోయింది..ఇరాన్ రక్షణ వ్యవస్థ కూలిపోయింది. 
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?

వీడియోలు

Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Tamil Nadu Assembly Elections 2026 : ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
Sampradayini Suppini Suddapoosani Review - 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
TTD News: ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
ఒక్క చార్జ్‌తో వందల కిలోమీటర్ల ప్రయాణం - రూ.15 లక్షల లోపే బ్రహ్మాండమైన ఎలక్ట్రిక్‌ కార్లు
పెట్రోల్‌ కోసం రూపాయి కూడా ఖర్చు కాదు - రూ.15 లక్షల లోపే బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కార్లు
Embed widget