అన్వేషించండి

Jio Platforms IPO: లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!

Reliance Industries: 2రోజుల్లో ప్రారంభం కానున్న జియో IPOకు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వస్తోంది. 8,100కోట్ల యాంకర్ బుకింగ్‌కు ఏకంగా 30 రెట్లు డిమాండ్ అంటే దాదాపు రూ. 2.5లక్షల కోట్ల బిడ్లు వచ్చాయి.

Jio Platforms IPO 2026: దలాల్‌ స్ట్రీట్‌లో కొన్ని రోజులుగా ఒకే విషయంపై చర్చ. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రిలయెన్స్ నుంచి వస్తున్న IPOపైనే ఇన్వెస్టర్లందరి గురి ఉంది. దేశీయ, విదేశీ ముదుపుదారులంతా.. రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న రిలయెన్స్ JIO IPOపై భారీ ఆసక్తి కనబరుస్తున్నారు.  కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన ₹8,110 కోట్ల విలువైన షేర్లకు సుమారు ₹2.5 లక్షల కోట్ల మేర బిడ్లు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి అంటే అందుబాటులో ఉన్న షేర్ల విలువతో పోలిస్తే 30 రెట్లకు పైగా డిమాండ్ నమోదైంది. భారత ఐపీఓ మార్కెట్‌లో సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ఈ స్థాయిలో డిమాండ్ రావడం ఇదే తొలిసారి. 

జియో ప్లాట్‌ఫామ్స్‌ తన మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడిపోయి, ప్రత్యేక సంస్థగా స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. దీంతో  జియో ఐపీఓపై పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ లిస్టింగ్ ద్వారా పెట్టుబడిదారులు జియో టెలికాం, డిజిటల్ సేవల వ్యాపారాల్లో నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తుంది. జియోలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న జాబితాలో  అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, దేశంలోని భారీ మ్యుచువల్ ఫండ్ హౌస్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. 

బ్లాక్‌రాక్, ఫిడెలిటీ వంటి అంతర్జాతీయ దిగ్గజాల ఆసక్తి

జియో ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలు ముందుకొచ్చాయి. బ్లాక్‌రాక్, క్యాపిటల్ గ్రూప్, ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, ష్రోడర్స్, జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్‌మెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్వెస్కో వంటి సంస్థలు ఆసక్తి చూపించినట్లు సమాచారం.

వీటితో పాటు సింగపూర్‌కు చెందిన జీఐసీ, నార్వేకు చెందిన నార్గెస్ బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వంటి సావరిన్ వెల్త్ ఫండ్స్ కూడా ఈ ఐపీఓపై దృష్టి సారించాయి.

దేశీయ మ్యూచువల్ ఫండ్స్ నుంచీ భారీ స్పందన

విదేశీ పెట్టుబడిదారులతో పాటు భారతదేశంలోని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థలు, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ కూడా జియో ఐపీఓలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, నిప్పాన్ ఇండియా, కోటక్ మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎల్‌ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ వంటి బీమా సంస్థలతో పాటు పెన్షన్ ఫండ్స్ కూడా ఆసక్తి చూపించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 

అక్టోబర్ 21న ప్రారంభం కానున్న ఐపీఓ

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగియనుంది. ఈ ఇష్యూ ద్వారా సుమారు ₹30,213 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని ₹1,065 నుంచి ₹1,119గా నిర్ణయించినట్లు సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడిగా జియో ప్లాట్‌ఫామ్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడం ద్వారా, పెట్టుబడిదారులు టెలికాం, డిజిటల్ సేవల వ్యాపారంలో నేరుగా వాటా పొందే అవకాశం ఉంటుంది.

టెలికాం నుంచి ఏఐ వరకు విస్తరిస్తున్న జియో

జియో ప్రస్తుతం మొబైల్ టెలికాం సేవలకే పరిమితం కాకుండా బ్రాడ్‌బ్యాండ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లోనూ విస్తరిస్తోంది. 50 కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులతో దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా కొనసాగుతోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jio IPO Live: రూ.30,213 కోట్ల జియో ఐపీఓ లైవ్.. సబ్‌స్క్రిప్షన్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డ్
రూ.30,213 కోట్ల జియో ఐపీఓ లైవ్.. సబ్‌స్క్రిప్షన్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డ్
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Sai Parenteral: సాయి పారెంటరల్స్ తొలి IPO - మార్చి 24న ప్రారంభం
సాయి పారెంటరల్స్ తొలి IPO - మార్చి 24న ప్రారంభం
ఈవారం IPOకు వస్తున్న 11 కంపెనీలు, నిధుల సమీకరణే లక్ష్యంగా పోటీ
ఈవారం IPOకు వస్తున్న 11 కంపెనీలు, నిధుల సమీకరణే లక్ష్యంగా పోటీ
Advertisement

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Advertisement
Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget